
తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం నియమించిన ప్రభుత్వ సలహాదారుల నియామకాలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నియమించిన సలహాదారుల నియామకాలు రద్దుచేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు జారీచేశారు. . సోమేష్ కుమార్, చెన్నమనేని రమేష్ , రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, ఏకే ఖాన్, జీఆర్ రెడ్డి, ఆర్.శోభ నియామకాలను రద్దు చేసింది తెలంగాణ ప్రభుత్వం. జీఆర్ రెడ్డి, ఆర్.శోభ నియామకాలను కూడా రద్దు చేసింది ప్రభుత్వం. .